

తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణకు లోబడి తీరాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి పురస్కారాన్ని అందజేశారు. ప్రజాస్వామ్యంలో చట్టానికి మించిన వ్యక్తులు ఉండరని ఆయన తేల్చిచెప్పారు.
తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని సీఎం కొనియాడారు. ఉద్యమకారులమని చెప్పుకునే కొందరు పదవులు, ఆస్తులు సంపాదించుకున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ వంటి నాయకులు పదవులను త్యాగం చేసి ప్రాణాలే అర్పించారని గుర్తు చేశారు. ప్రజల తీర్పును గౌరవించకుండా, తప్పులను ప్రజలపై నెట్టివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నవారు తప్పకుండా విచారణను ఎదుర్కోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!