
గాసిప్స్

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శనివారం ట్వీట్ ద్వారా మండి పడ్డారు. సొరంగం కూలి ఏడాది కావొస్తున్నా మృత కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం పురోగతి సాధించలేదని ఆరోపించారు.
కార్మికుల కుటుంబాలకు కనీసం చివరిచూపు చూసే అవకాశం కూడా లేకుండా మానసిక వేదనకు గురిచేశారని కేటీఆర్ పేర్కొన్నారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలో కానీ, సొరంగ పనుల పురోగతిలో కానీ స్పష్టమైన అభివృద్ధి కనిపించకపోవడం రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కమీషన్లు, కాంట్రాక్టులపై చూపుతున్న శ్రద్ధను కార్మిక సంక్షేమం, ప్రజా శ్రేయస్సుపై పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!