

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత అసభ్యమైన ఘటన చోటుచేసుకుంది. కొరియాకు చెందిన ఒక పర్యాటకురాలి పై, విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది ఒకరు తనిఖీల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు వివరాల ప్రకారం, ఈ పర్యాటకురాలు జనవరి 19 న స్వదేశానికి వెళ్ళేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్ తనిఖీ తర్వాత టెర్మినల్ వైపు వెళ్తుండగా, మొహమ్మద్ అఫాన్ అనే గ్రౌండ్ సిబ్బంది ఆమె టికెట్ తనిఖీ చేయాలంటూ ఆపాడు. తనిఖీ కోసం ఆమెను పురుషుల వాష్రూమ్ సమీపానికి తీసుకెళ్లి అనుచితంగా తాకాడు. ఆమె ప్రతిఘటించడంతో అతను అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని విమానాశ్రయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
విమానాశ్రయ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసుల దగ్గరకి అప్పగించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఫిర్యాదును ధృవీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ రకమైన ఘటనలు మళ్ళీ రాకుండా మరియు ప్రయాణీకుల హక్కులను రక్షించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకోబడ్డాయి.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!