
గాసిప్స్

ఒడిశాలోని 13 వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయ గర్భ గుడిలోకి త్వరలో భక్తులకు ప్రవేశం కలగనుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం ఇసుకతో నిండి ఉంది. ఆలయం వెనుక ఉన్న 15 అడుగుల ఎత్తైన గోడ కూలిపోకుండా కాపాడేందుకు బ్రిటిష్ పాలకులు 1903 – 04 లో గర్భ గుడిని వేల టన్నుల ఇసుకతో నింపారు.
జగ్మోహన్ హాల్‌గా పిలిచే ఈ ప్రదేశంలోకి శతాబ్దం పాటు ఎవరూ వెళ్లలేదు. ఇప్పుడు భారత పురావస్తు శాఖ, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కలిసి ఇసుకను తొలగించే పనిని ప్రారంభించింది. మొత్తం ఇసుకను పూర్తిగా తొలగించడానికి సుమారు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు.
ఇసుక తొలగించిన తర్వాత లోపలి గోడల బలాన్ని పరిశీలిస్తారు. ఆ నివేదిక ఆధారంగా గర్భ గుడి పునర్నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!