

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.8.80 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ఇక తమిళనాడులోని మదురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడి ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు లభించే అవకాశం ఉంది.
అదే సమయంలో వంట గ్యాస్ సరఫరాపై కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గ్యాస్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీలు గ్యాస్ ఉత్పత్తిని 10 శాతం పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!