
సినిమాలు

పాకిస్థాన్లోని కరాచీ నగరంలో గుల్ షాపింగ్ ప్లాజాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల తొలగింపు కొనసాగుతుండగా, ఇంకా పలువురు మృతదేహాలు బయటపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నగరాన్ని తీవ్రంగా కలచివేసింది.
అగ్నిప్రమాదం సమయంలో మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు దుకాణాల లోపల దాక్కోగా, ఊపిరి ఆడక మృతి చెందినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ‘దుబాయ్ క్రాకరీ’ అనే షాపులోనే ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకు మృతుల్లో కేవలం 12 మందినే గుర్తించగలిగామని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!