

ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, “నాకు నరేంద్ర మోదీ మిత్రుడు మాత్రమే కాదు, సోదరుడి కంటే ఎక్కువ” అని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇజ్రాయెల్‌కు ఆయన ప్రధాన స్నేహితుడని అన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయని, ఇరు దేశాల మధ్య సహకారం నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించారు. భారత్–ఇజ్రాయెల్ అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేమని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ, ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. భారత్, ఇజ్రాయెల్ రెండూ ప్రాచీన నాగరికతలతో కూడిన దేశాలని పేర్కొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడులపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన, ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. టెర్రరిజంపై ప్రపంచ దేశాలు కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చి, ఉగ్రవాద నిర్మూలనలో భారత్ ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని తెలిపారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!