
క్రీడలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు నిర్వహించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో టెహ్రాన్‌లోని పాఠశాలలు, కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది.
ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఇజ్రాయెల్ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. అదనపు భద్రతా చర్యలలో భాగంగా వైమానిక మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!