

ఇరాన్–అమెరికా యుద్ధ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడుతూ గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలలో గుడ్ల ధరలు తగ్గుతాయి. అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా ఈసారి ధరలు మరింతగా క్షీణించాయి. యుద్ధం ప్రారంభానికి ముందు రైతులకు ఒక్కో గుడ్డుకు సుమారు రూ.5.50 వరకు ధర లభించగా, ప్రస్తుతం అది రూ.3.60కు తగ్గిపోయింది. ఇది వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినా, ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
తమిళనాడులోని నమక్కల్ పౌల్ట్రీ పరిశ్రమ కేంద్రం నుంచి గల్ఫ్ దేశాలకు రోజూ 35–40 లక్షల గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం యుద్ధం కారణంగా ఈ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే పంపిన గుడ్లను కూడా తిరిగి దేశీయ మార్కెట్లకు మళ్లించడంతో సరఫరా పెరిగి ధరలు పడిపోయాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కూడా ధరలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని, వచ్చే 10–15 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని పౌల్ట్రీ రంగం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!