

దోమలు కేవలం ఇబ్బంది కలిగించే కీటకాలు మాత్రమే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేసే ప్రమాదకర జీవులు. మార్కెట్‌లో లభించే కాయిల్స్, మ్యాట్‌లు, లిక్విడ్స్ వాడుతున్నప్పటికీ వాటి నుంచి వచ్చే రసాయనాలు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు కలిగించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని కాలాల్లో దోమల బెడద పెరుగుతుండటంతో సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది.
సహజమైన పద్ధతులతో తక్కువ ఖర్చుతో దోమలను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం సమయంలో కర్పూరం, ఎండిన వేపాకులు కలిపి పొగ వేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. అలాగే సాంబ్రాణిలో వేప నూనె లేదా యూకలిప్టస్ నూనె, లెమన్ గ్రాస్ నూనె వంటి వాటిని ఉపయోగిస్తే దోమల ప్రభావం తగ్గుతుంది. దోమ కాటు వచ్చిన చోట కలబంద రసం రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
గమనిక : దోమ కాట్ల వల్ల జ్వరం, అలర్జీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!