
సినిమాలు

మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 8 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు అధికారులు క్యాంప్ కార్యాలయంలో కలిసి అధికారికంగా ఆహ్వానించారు.
ఈ సమావేశంలో స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేయగా, ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివరించిన ఆలయ బోర్డు సభ్యులు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇదే విధంగా మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎంను ఆహ్వానించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!