

బేగంపేట విమానాశ్రయం వేదికగా ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన అట్టహాసంగా కొనసాగుతోంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో దేశీయ, విదేశీ విమానాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన లోహ విహంగాలతో పాటు విదేశీ సాంకేతికతతో తయారైన విలాసవంతమైన విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విమానాల ప్రత్యేకతలను పైలట్లు, సంస్థల ప్రతినిధులు వివరించగా, వాటితో ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఉత్సాహం చూపించారు.
ఈ ప్రదర్శనలో భారత్కు గర్వకారణంగా నిలిచింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన సరికొత్త ‘ధ్రువ ఎన్జీ’ హెలికాప్టర్. ఇది పూర్తిగా పౌర విమానయాన అవసరాల కోసం రూపొందించిన నెక్ట్స్ జనరేషన్ వెర్షన్. అత్యంత ఎత్తైన ప్రాంతాలు, ప్రతికూల వాతావరణంలోనూ పనిచేసే శక్తివంతమైన ఇంజిన్లు, గ్లాస్ కాక్పిట్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు, విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఈ హెలికాప్టర్లో 12 నుంచి 14 మంది ప్రయాణించవచ్చు. అలాగే చిన్న పట్టణాల అనుసంధానానికి రష్యా రూపొందించిన ఐఎల్-114-300 టర్బోప్రాప్ విమానం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!