
టెక్నాలజీ

భారత అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తూ ప్రస్తుతం ₹70,000 కోట్ల స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. ఇస్రో ఇప్పటివరకు 434 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించగా, వాటి ద్వారా దేశానికి సుమారు ₹4,800 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత అంతరిక్ష సాంకేతికతకు ఉన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు, స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని, ప్రస్తుతం దేశంలో 399 స్పేస్ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. రాబోయే 8 నుంచి 10 ఏళ్లలో భారత స్పేస్ ఎకానమీ 4 నుంచి 5 రెట్లు వృద్ధి చెంది ₹3.3 నుంచి ₹3.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అంచనా వేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!