

టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో భారత్ – న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు వేదికగా ఉన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్దకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మ్యాచ్‌కు సంబంధించిన అన్ని టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. ఫైనల్ మ్యాచ్ క్రేజ్‌తో అహ్మదాబాద్ నగరం ప్రస్తుతం పూర్తిగా క్రికెట్ జ్వరం పట్టినట్టుగా కనిపిస్తోంది.
టిక్కెట్లను అధికారికంగా బుక్‌మైషో యాప్ ద్వారా విక్రయించగా, ప్రారంభ ధర ₹2,000 కాగా గరిష్ట ధర ₹75,000గా నిర్ణయించారు. అయితే టిక్కెట్లు దొరకని అభిమానులను దళారులు టార్గెట్ చేస్తూ బ్లాక్ మార్కెట్లో ఒక్కో టిక్కెట్‌ను ₹2 లక్షల నుంచి ₹3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ఎలాంటి ఫిజికల్ టిక్కెట్లు విక్రయించలేదని, కేవలం బుక్‌మైషో ద్వారానే బుకింగ్స్ జరిగాయని తెలిపారు. అలాగే అడ్డదారుల్లో టిక్కెట్లు కొనవద్దని అభిమానులకు హెచ్చరించారు. ఇదే సమయంలో ఫైనల్ మ్యాచ్ కారణంగా అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో హోటల్ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. సాధారణంగా ₹4,000 ఉండే గది ధరలు ఇప్పుడు ₹40,000కు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!