
రాజకీయాలు

భారత్లో సంపద సృష్టి వేగంగా పెరుగుతోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 308 మంది బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వీరి కలిపిన మొత్తం సంపద సుమారు రూ.112.6 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
గత ఏడాదితో పోలిస్తే మరో 24 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరడం విశేషంగా నిలిచింది. దేశంలోని ఆర్థిక కేంద్రం ముంబైలోనే అత్యధికంగా 95 మంది బిలియనీర్లు నివసిస్తున్నారని నివేదిక తెలిపింది.
అదేవిధంగా మొత్తం జాబితాలో 23 మంది మహిళా బిలియనీర్లు ఉండటం కూడా ప్రత్యేకంగా గమనించదగిన విషయం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!