
.webp&w=3840&q=75)
హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, వీసా అపాయింట్మెంట్ల రద్దు అంశాల పై భారత్ తన ఆందోళనను వ్యక్తం చేసింది. అమెరికా వీసా అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయడం లేదా మళ్లీ రీషెడ్యూల్ చేయడంలో అనేక మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారత విదేశాంగశాఖ తెలిపింది. ఈ విషయమై తమకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.
ఈ అంశం పూర్తిగా అమెరికా సార్వభౌమాధికార పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసినప్పటికీ, భారతీయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ ఆందోళనలను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఇదే సందర్భంగా, కెనడాలో ఇటీవల గుండెపోటుతో మరణించిన భారత సంతతి వ్యక్తి ఘటన పై కూడా భారత్ స్పందించింది. ఆయనకు భారత మూలాలు ఉన్నప్పటికీ, కెనడా పౌరసత్వం కలిగిన వ్యక్తి కావడంతో ఆ ఘటన పై బాధ్యత పూర్తిగా కెనడా ప్రభుత్వానిదేనని భారత్ స్పష్టం చేసింది.
తీవ్ర ఛాతీనొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, దాదాపు ఎనిమిది గంటల పాటు చికిత్స కోసం వేచిచూడాల్సి వచ్చిందని, చివరకు తన భర్త ప్రాణాలు కోల్పోయారని బాధితుడి భార్య నిహారికా శ్రీకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై భారత్ స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తూ, సంబంధిత దేశ ప్రభుత్వాల బాధ్యతలను గుర్తు చేసింది.



.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!