
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని సీసీఎస్ పోలీసులు 12 రోజుల పాటు కస్టడీలో విచారించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తికి చెందిన డాక్యుమెంట్లను రవి దొంగిలించి, అతని పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి, కస్టడీలో ఉన్న రవి ఎదుటే పోలీసులు ప్రశ్నించారు.
రవి కన్ఫెషన్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత మూడు సంవత్సరాల్లో రవి సుమారు రూ.13 కోట్లు సంపాదించగా, అందులో రూ.10 కోట్లు విలాసాల కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రవి అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలోనే బస చేసినట్టు దర్యాప్తులో తేలింది. అలాగే 2007లోనే స్నేహితుల సర్టిఫికెట్లు దొంగిలించి, ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్ పేర్లతో ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ గుర్తింపులతో సప్లయ్ ఇండియా, హాస్పిటల్ INN, ER ఇన్ఫోటెక్ సంస్థలను స్థాపించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.






.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!