
ఆరోగ్యం

మహిళల పై చేసిన వ్యాఖ్యల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని తెలంగాణ మహిళా కమిషన్ నటుడు శివాజీకి సూచించింది. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన నేడు మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన వ్యాఖ్యల పై శివాజీ కమిషన్కు స్పష్టమైన వివరణ ఇచ్చారు. తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించాలని కోరారు. ఇక పై మహిళల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా, గౌరవంతో వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!