
టెక్నాలజీ

న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రయాణీకులకు శుభవార్త తెలిపింది. సాధారణంగా మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 వ తేదీ రాత్రి మెట్రో సేవల వేళలను హెచ్ఎమ్ఆర్ఎల్ పొడిగించింది.
ఈ నిర్ణయం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైళ్లు రాత్రి ఒంటిగంటకు బయలుదేరనున్నాయి. అందువల్ల మెట్రో ప్రయాణీకులు ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని హెచ్ఎమ్ఆర్ఎల్ సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!