
సినిమాలు

అమరావతి సచివాలయంలో భద్రతా సిబ్బంది నిజాయితీ మరోసారి ప్రశంసలు పొందింది. రెవెన్యూ శాఖలో సెక్షన్ అధికారి (ఎస్వో)గా పనిచేస్తున్న పద్మ, గురువారం ఉదయం విధులకు వస్తున్న సమయంలో గేట్–2 వద్ద తన బంగారు గొలుసును పొగొట్టుకుంది. ఇది గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ జనార్ధన్ రావు, ఆ గొలుసును వెంటనే సురక్షితంగా తీసుకున్నారు.
జనార్ధన్‌రావు ఆ బంగారు గొలుసును సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి మల్లికార్జునకు అప్పగించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు, ఆ గొలుసు పద్మదేనని నిర్ధారించి ఆమెకు తిరిగి అందజేశారు. నిజాయితీగా వ్యవహరించిన జనార్ధన్ రావు సహా ఎస్పీఎఫ్ సిబ్బందిని సచివాలయ ఉద్యోగులు ప్రశంసించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!