
గాసిప్స్

ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో గీతం యూనివర్సిటీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008 నుంచి రూ.118 కోట్ల విద్యుత్ బకాయి బిల్లు చెల్లించకపోవడంపై దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (SPDCL) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ గీతం యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది.
విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “సాధారణ ప్రజలు రూ.వెయ్యి బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. అయితే గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకు?” అని వ్యాఖ్యానించారు.
కరెంట్ బకాయిలపై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, హైకోర్టు సూపరింటెండెంట్ ఇంజినీర్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ త్వరలో జరగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!