

టాలీవుడ్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. రావిపూడి గత చిత్రాలకు ఉన్న ఓటీటీ క్రేజ్ దృష్ట్యా ఈ డీల్ రికార్డు స్థాయిలో జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వైజాగ్‌లో స్క్రిప్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేసే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేశారు. కృతి శెట్టి హీరోయిన్గా ఖరారై ఉండగా, మరో కీలక పాత్ర కోసం కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభమై, 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. మాస్, కామెడీ, ఎమోషన్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.











.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!