

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంలో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన స్నేహితురాలు సానియా చందోక్‌ను మార్చి తొలి వారంలో వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం ఘనంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా, అనంత్ అంబానీ, రాధిక మెర్చంట్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన నీతా అంబానీ, టెండూల్కర్ కుటుంబంతో తమకు ఉన్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సచిన్, అంజలి టెండూల్కర్ తమ కుటుంబ సభ్యుల్లాంటివారని పేర్కొన్నారు. అర్జున్ చిన్నప్పటి నుంచి తమ కళ్ల ముందే పెరిగాడని చెప్పిన ఆమె, సానియా చుట్టూ సానుకూలత ఉందని ప్రశంసించారు. ఈ జంట జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు. సచిన్ టెండూల్కర్‌కు ముకేశ్ అంబానీతో దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉండగా, ముంబయి ఇండియన్స్‌కు ఆయన మెంటార్‌గా కొనసాగుతున్నారు. అర్జున్ కూడా ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడటమే కాకుండా ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!