

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా దేశభక్తి భావాలను రగిలించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఎగరవేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కర్తవ్యపథ్‌పై జరిగిన పరేడ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలను రాష్ట్రపతి ఆత్మీయంగా స్వాగతించారు. రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయ బగ్గీలో ముఖ్య అతిథులతో కలిసి వచ్చిన రాష్ట్రపతి కర్తవ్యపథ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
త్రివిధ దళాల పరేడ్‌తో గణతంత్ర దినోత్సవ కవాతు ప్రారంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ భవ్నీశ్ కుమార్ నేతృత్వంలో సాగిన ఈ పరేడ్‌లో సైనికుల కవాతు, ప్రచండ్ హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ సమయంలో ధరించే యూనిఫామ్‌తో అశ్వికదళం తొలిసారిగా పాల్గొనడం విశేషంగా నిలిచింది. “ వందేమాతరం ” అనే థీమ్‌తో సాగిన ఈ పరేడ్‌లో దేశ అభివృద్ధి, సంస్కృతి వైవిధ్యం, అలాగే ఆపరేషన్ సిందూర్ ప్రాధాన్యతను చూపించే స్వదేశీ ఆయుధాలను ప్రదర్శించారు. తొలిసారిగా భారత ఆర్మీ బ్యాటిల్ ఎరే ఫార్మాట్లో పరేడ్ నిర్వహించింది. వేడుకలకు ముందే భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు రాష్ట్రపతి అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్రను అందజేశారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!