
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మార్కాపురం జిల్లా మరియు పోలవరం జిల్లాలను అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు కూడా చేపట్టినట్లు తెలిపింది. పరిపాలనను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశామని పేర్కొంది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సంఖ్య 28 కు పెరిగింది. ఈ మార్పులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!