

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్టాగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. కార్లు, జీపులు, వ్యాన్ల (Car/Jeep/Van కేటగిరీ) కొత్త ఫాస్టాగ్‌ల జారీలో 'నో యువర్ వెహికల్' (KYV) ప్రక్రియను ఫిబ్రవరి 1, 2026 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఫాస్టాగ్ యాక్టివేషన్ తర్వాత KYV ప్రక్రియ వల్ల జాప్యాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన NHAI ఈ నిబంధనను తొలగించింది. ఇకపై బ్యాంకులు ఫాస్టాగ్ జారీ చేసేటప్పుడే వాహన్ డేటాబేస్ (VAHAN) ద్వారా వివరాలు వెరిఫై చేసి యాక్టివేట్ చేయనున్నాయి.
ఇప్పటికే జారీ అయిన కార్ల ఫాస్టాగ్‌లకు కూడా రొటీన్ KYV అవసరం లేదు. ఫాస్టాగ్ సరిగా అతికించకపోవడం, దుర్వినియోగం వంటి ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే KYV తప్పనిసరి. ఈ మార్పుతో లక్షలాది మంది వాహనదారులకు సులభత్వం కలుగనుంది. KYV ప్రక్రియలో వాహనదారులు వాహనం ముందు, సైడ్ వ్యూ ఫొటోలు, RC, విండ్షీల్డ్పై అతికించిన ఫాస్టాగ్ స్టిక్కర్ ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉండేది. ఇక ఆ ఇబ్బంది తొలగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!