
ఆరోగ్యం

ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి సోమవారం గోదావరి నీరు మళ్లీ కృష్ణా డెల్టా వైపు చేరడం ప్రారంభించింది. సుమారు 2,100 క్యూసెక్కుల నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలోకి విడుదల చేస్తున్నట్టు ఈఈ ఏసుబాబు తెలిపారు. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొత్తం ఆరు మోటారు పంపులను ప్రారంభించి నీటిని పంపిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఇటీవలి పది రోజులుగా గోదావరిలో నీటి మట్టం 14 మీటర్ల వద్ద ఉండటంతో, అప్పటివరకు కేవలం రెండు పంపులతోనే నీటిని విడుదల చేశామని వివరించారు. ఇప్పుడు నీటి మట్టం అనుకూలంగా మారడంతో పంపుల సంఖ్యను పెంచి డెల్టాకు అవసరమైన నీటిని పంపుతున్నామని తెలిపారు.
.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!