

అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్థాయిలో స్పందన రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ కోర్సు నేర్చుకునేందుకు దాదాపు 50 వేల మంది నమోదు చేసుకున్నట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. ఏపీలో లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది బలమని ఆయన పేర్కొన్నారు.
ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్పీటీఈఎల్ సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. క్వాంటం రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను గమ్యస్థానంగా మార్చాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కోర్సులో బంగారు, వెండి పతకాలు సాధించే అభ్యర్థులను స్వయంగా సత్కరించేందుకు ఎదురుచూస్తున్నానని సీఎం తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!