
గాసిప్స్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సోమవారం దక్షిణ, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడినట్టు తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే దీని ప్రభావంతో ఈ నెల 9 వ తేదీ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో దట్టమైన మంచు (ఫాగ్) కురుస్తోందని IMD తెలిపింది. ఈ పరిస్థితి మరో నాలుగు రోజులు కొనసాగవచ్చని వెల్లడించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తరు స్థాయిలో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!