

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) లో అగ్నిప్రమాదం సంభవించింది. కార్డియాలజీ విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నారు. వేగంగా మంటలను అదుపులోకి తెచ్చి, ప్రమాదాన్ని నివారించారు. హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, రోగులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది, కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. హాస్పిటల్ సూపరింటెండెంట్ స్పందిస్తూ, ఘటన పై విచారణ చేసి, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాము అని తెలిపారు.
గతేడాది జూన్లో KGH లోని వెంటిలేటర్ యంత్రంలో మంటలు చెలరేగడంతో మరో అగ్నిప్రమాదం జరిగింది. వార్డు అంతటా దట్టమైన పొగ కమ్మేయడంతో సిబ్బంది అప్రమత్తమై, రోగులు, సిబ్బందిని వెంటనే వేరే వార్డులకు తరలించారు. అప్పటి సూపరింటెండెంట్ శివానంద్ ప్రకారం, ప్రమాద సమయంలో వార్డులో 8 మంది రోగులు చికిత్స పొందుతున్నారు, కానీ ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలు KGH లో భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.





.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!