

హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు FIR నమోదు చేశారు. FSL ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, ఉదయం 10:08 గంటల సమయంలో ల్యాబ్‌లోని ప్రాపర్టీ రూమ్‌లో మంటలు చెలరేగినట్లు వెల్లడైంది. మంటలను గమనించిన ఉద్యోగి సాయికృష్ణ వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా, ఉదయం 10:30 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి సుమారు మూడు గంటల శ్రమ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని FSL డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ ఘటనపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అగ్నిప్రమాద సమయంలో అక్కడ ఎవరు ఉన్నారనే అంశంపై సమగ్రంగా ఆరా తీస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులను నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!