

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కలకలం రేపింది. హామన్టన్ ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి.
హెలికాప్టర్లు ఢీకొన్న వెంటనే భారీగా మంటలు ఎగసిపడటంతో, ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో ఒక హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమవ్వగా, మరో హెలికాప్టర్ సమీప అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాల పై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!