
టెక్నాలజీ

పోలీసుల విచారణలో iBomma రవికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో జరుగుతున్న అవమానాలు అతణ్ని తప్పు దారుల్లోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘నువ్వు ఏం చేసినా డబ్బు సంపాదించలేవు’ అంటూ అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, అలాగే అత్త తరచూ దూషించేవారని తెలుస్తోంది.
మళ్లీ మళ్లీ వస్తున్న ఆ అవమానాలను భరించలేక, తాను నేర్చుకున్న వెబ్‌డిజైన్ నైపుణ్యాన్ని ఉపయోగించి iBomma, BAPPAM లాంటి సైట్లను రూపొందించాడు. ఈ సైట్లు తెచ్చిన భారీ ఆదాయంతో రవి జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే ఆ డబ్బుతోనే అన్ని సమస్యలు సరిచేస్తానని అనుకున్నా, అతడ్ని వదిలి వెళ్లిన భార్య మాత్రం తిరిగి రాలేదు.
డబ్బు వచ్చినా, కుటుంబం దూరమైపోయిన బాధతో 2021లో రవి యూరప్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.



.jpg&w=3840&q=75)







.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)


కామెంట్స్ (1)
మనసును గాయపరిచే మాటలు ఎంత పెద్ద మార్పులు తీసుకురాగలవో రవి కథ స్పష్టంగా చూపిస్తోంది.