

పేదరికం, కుటుంబ నిర్లక్ష్యం, మోడలింగ్ అవకాశాల ఆశ వంటి కారణాలతో వందలాది బాలికలు, యువతులు అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ వలలో చిక్కి అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్‌కు బలయ్యారు. ఆ నరకం నుంచి బయటపడ్డ బాధితులు చెప్పిన కథలు సమాజాన్ని కుదిపేశాయి. ఇటీవల ఈ కేసు మళ్లీ చర్చకు రావడానికి కారణం బాధితుల జాబితాలో భారతదేశానికి చెందిన ఒక బాలిక పేరు ఉన్నట్లు వెలుగులోకి రావడమే. ఇది పిల్లల భద్రత, అధికార దుర్వినియోగం, మరియు న్యాయ వ్యవస్థ బాధ్యతలపై మళ్లీ చర్చను ప్రారంభించింది.
మయామీ హెరాల్డ్‌కు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జూలీ కె. బ్రౌన్ ఈ కేసును తిరగదీసిన కీలక వ్యక్తిగా నిలిచారు. కోర్టు పత్రాలను పరిశీలించి, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని, 2008లో ఎప్స్టీన్కు తేలికపాటి శిక్ష పడటానికి కారణమైన ప్లీ డీల్‌ను బయటపెట్టారు. ఆమె రాసిన కథనాల సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, 2019లో కేసు మళ్లీ విచారణకు దారి తీసింది. విచారణ కొనసాగుతుండగానే ఎప్స్టీన్ జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. బాధితుల ధైర్యమే అసలు న్యాయ పోరాటానికి ప్రేరణ అని బ్రౌన్ పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!