
సినిమాలు

జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. గూఢచారి సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా, దాగి ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఈ ఎన్కౌంటర్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను కూడా మోహరించారు. ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!