
టెక్నాలజీ

భారత్ 5జీ వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానాన్ని సాధించింది. 5జీ చందాదారుల సంఖ్య 40 కోట్లకు చేరగా, నెలకు 12.9 ఎక్సాబైట్స్ డేటా వినియోగంతో దేశం గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. అలాగే 2026 ఫిబ్రవరి నాటికి 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ చందాదారుల సంఖ్య 1.19 కోట్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు దేశంలో 5జీ సాంకేతికత వేగంగా విస్తరిస్తోందని సూచిస్తున్నాయి.
ఇక దేశవ్యాప్తంగా గత ఏడాది 13.7 కోట్ల 5జీ ఫోన్లు అమ్ముడవ్వగా, ప్రస్తుతం వినియోగంలో ఉన్న 89.2 కోట్ల 4జీ ఫోన్లలో 38.3 కోట్ల యూనిట్లు 5జీకి సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో మొత్తం ఇంటర్నెట్ వినియోగంలో 5జీ వాటా 58 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఈ పరిణామాలు డిజిటల్ కనెక్టివిటీ పరంగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!