

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పెద్ది మరోసారి వార్తల్లో నిలిచింది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పటికే మంచి హైప్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ పాటలో పలువురు హీరోయిన్లు కనిపిస్తారనే ప్రచారం జరిగింది, కానీ తాజా సమాచారం ప్రకారం అది నిజం కాదని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ కోసం మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న మానస వారణాసి పేరు బలంగా వినిపిస్తోంది. మొదట మృణాల్ ఠాకూర్ పేరు వినిపించినప్పటికీ, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మానస ఇప్పటికే తన నటన, డాన్స్‌తో మంచి గుర్తింపు పొందింది. ఈ అవకాశం నిజమైతే ఆమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్‌తో కలిసి ఆమె చేసే డాన్స్ ఎలా ఉంటుందో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇక సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి స్పందన పొందాయి. ఈ నెల 30 నాటికి షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సాంగ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!