

నూతన సంవత్సర వేడుకలు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని పబ్బులు, బార్లు, క్లబ్బులు సందడితో నిండిపోయాయి. అయితే వేడుకల ఉత్సాహం మధ్య కొన్ని ఘటనలు ఆందోళనకు కారణమయ్యాయి.
నగరంలోని ఒక ప్రముఖ పబ్‌లో పనిచేస్తున్న డీజే ఆర్టిస్ట్‌కు డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు నార్సింగి పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, బషీర్‌బాగ్, ఐమాక్స్, దోమలగూడ తదితర ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించారు. వాహనాలను నిలిపి పరీక్షలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేశారు.
పోలీసుల చర్యలతో నగరంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!