
దేశీయ విమాన మార్కెట్లో 63% వాటా కలిగిన అగ్రగామి ఎయిర్ లైన్ ఇండిగో, డీజీసీఏ తాజా నిబంధనలను అమలు చేయడంలో విఫలమై భారీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 2024 జనవరిలో జారీ చేసిన కొత్త నిబంధనలు ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి రావాల్సి ఉందని తెలిసినా, పైలట్లు–క్రూ సిబ్బంది నియామకాలను ముందుగానే చేపట్టకపోవడంతో పరిస్థితి విషమించింది.
రోజూ వందలాది ఫ్లైట్లు రద్దవ్వడం, వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడటం యథావిధిగా కొనసాగింది. శీతాకాల రద్దీ కారణంగా డీజీసీఏ తాత్కాలికంగా సడలింపులు ఇవ్వడంతో రవివారంనుంచి కొంత మెరుగుదల కనిపించినా, ఫిబ్రవరి 10 నాటికి నిబంధనలు పూర్తిగా అమల్లోకి రావాల్సి ఉండడంతో ఇండిగో భారీ నియామకాలపై దృష్టి సారించింది.
ఆంగ్లపత్రికల ప్రకారం ఇండిగో ప్రభుత్వం, డీజీసీఏలకు ఇచ్చిన హామీలు:
158 పైలట్లు – ఫిబ్రవరి 10, 2026 లోపు
742 పైలట్లు – 2026 డిసెంబరు లోపు
మొత్తం 900 పైలట్లు అదనంగా నియమించుకోనున్నట్లు వెల్లడించింది.
అదనంగా వచ్చే 12 నెలల్లో:
300 కెప్టెన్లు
600 జూనియర్ ఫస్ట్ అధికారులు నియమించుకుంటామని తెలిపింది.
250 జూనియర్ మొదటి అధికారులకు ప్రస్తుతం శిక్షణ ఇస్తోంది.
అవసరాలను బట్టి 300 కెప్టెన్లు, 600 ఫస్ట్ అధికారులను నియమించుకోవాలని ప్రణాళిక.
కంపెనీలో ఇప్పటికే 2,357 కెప్టెన్లు, 2,194 ఫస్ట్ అధికారులు ఉన్నారు.
ఈ నెలాఖరు వరకు 25 కెప్టెన్లు, 35 ఫస్ట్ అధికారులు అదనంగా చేరనున్నారు.
2026 జనవరిలో ఇంకొం 28 కెప్టెన్లు, 35 ఫస్ట్ అధికారులు.
2026 ఫిబ్రవరి 10 నాటికి 15 కెప్టెన్లు, 20 ఫస్ట్ అధికారులు చేరనున్నారు.
గడువు నాటికి ఇండిగో వద్ద 2,425 కెప్టెన్లు, 2,284 ఫస్ట్ అధికారులు ఉంటారు.
డీజీసీఏ కొత్త నిబంధనలు (నవంబర్ 1 నుంచి అమల్లో):
పైలట్లు వారానికి రెండు రోజులు మాత్రమే రాత్రివేళ (12 am–6 am) ల్యాండింగ్ చేయాలి
వరుసగా రెండు రాత్రులు పనిచేస్తే, మూడవ రోజు ఓవర్డే రెస్ట్ తప్పనిసరి
ఇతర ఎయిర్లైన్ల రాత్రి సర్వీసులు తక్కువగా ఉండటం, అవసరాలకు తగ్గట్టుగా నియామకాలు ఇప్పటికే పూర్తి కావడం వల్ల పెద్దగా ఇబ్బందులు కనిపించలేదు. అయితే ఇండిగో రాత్రి సర్వీసులు అధికంగా ఉండటం, ఫ్లీట్ పెద్దదిగా ఉండటంతో సిబ్బంది అవసరం భారీగా పెరిగింది.
ఒక పైలట్ మరో ఎయిర్‌లైన్‌కు మారాలంటే కెప్టెన్ 12 నెలలు, కో–పైలట్ 6 నెలల ముందే నోటీసు ఇవ్వాలి
విదేశీ పైలట్ల నియామకానికి కనీసం 3 నెలలు కావాలి అని నిపుణులు సూచిస్తున్నారు
ఇండిగో వద్ద ప్రస్తుతం:
417 విమానాలు
ఇంజిన్ సమస్యల కారణంగా 40 A320లు గ్రౌండ్లో
పనిచేస్తున్నవి 325 విమానాలు
ఒక్కో విమానం రోజుకు 14 గంటలు ఆపరేట్ అవుతోంది (ఇండస్ట్రీ సగటు 8.5 గంటలు)
ఒక విమానానికి సగటున:
14 పైలట్ సెట్లు అవసరం
ఇండిగో వినియోగాన్ని బట్టి 17 సెట్లు అవసరం
అవసరమైనది: 5,525 పైలట్లు
ప్రస్తుతం ఉన్నది: 4,551 పైలట్లు
లోటు: 974 పైలట్లు
ఇతర ఎయిర్లైన్లు:
ఎయిర్ ఇండియా: 5.4 పైలట్లు/విమానానికి
ఆకాశ ఎయిర్: 5.4 పైలట్లు/విమానానికి
ఇండిగో వద్ద: 2.5 పైలట్లు/విమానానికి మాత్రమే
ఈ భారీ లోటును పూరించేందుకు ఇండిగో అరుదైన నియామక సవాల్‌ను ఎదుర్కొంటోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!