
ఆరోగ్యం

ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) 2026 నుండి 2030 మధ్యకాలంలో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. గ్రీన్హౌస్ వాయువుల ప్రభావం మరియు వాతావరణ మార్పుల కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక యుగానికి ముందు స్థాయిలతో పోలిస్తే 1.3°C నుండి 1.9°C వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
2026 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు. 2027 నాటికి వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల హీట్‌వేవ్స్, కరువు పరిస్థితులు, తీవ్రమైన వాతావరణ మార్పులు పెరిగి ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం మరియు నీటి వనరులపై తీవ్ర ప్రభావం పడవచ్చని నివేదికలో వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!