

బంజారాహిల్స్‌లోని ఐటీసీ కోహినూర్‌లో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు బోర్డు సభ్యులు ఉపాసన కొనిదెల, కావ్య మారన్, సంజీవ్ గోయెంకా, సి. శశిధర్, జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఎండి సోనీ బాలా దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను దేశానికి క్రీడల్లో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం తెలిపారు.
గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వేదికగా అభివృద్ధి చేయడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జూన్ 2 న స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అప్పటికి పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. హెలిప్యాడ్ సహా అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేసి, విమానాశ్రయం నుంచి క్రీడాకారులు నేరుగా హెలికాప్టర్ ద్వారా స్టేడియానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రణాళిక రూపొందిస్తామని, ఒలింపిక్స్ నిర్వహించే స్థాయి సదుపాయాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!