
బిజినెస్

నటి త్రిష కృష్ణన్ సినిమాలకు అతీతంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ నటుడితో కలిసి వేడుకకు హాజరుకావడం తమిళనాడు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పలు రూమర్లు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో త్రిష సోషల్ మీడియాలో ప్రేమపై ఓ కోట్‌ను షేర్ చేస్తూ “ప్రతిదీ ప్రేమ కాదు, కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు” అని పేర్కొని ‘ఫ్యాక్ట్’ అని క్యాప్షన్ ఇచ్చారు.
సినిమాల విషయానికొస్తే, త్రిష రెండు దశాబ్దాలకుపైగా హీరోయిన్‌గా రాణిస్తున్నారు. సూర్య సరసన నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) వచ్చే నెల 14 న విడుదల కానుంది. అలాగే చిరంజీవితో ‘విశ్వంభర’ లో నటిస్తుండగా, మోహన్‌లాల్తో చేసిన ‘రామ్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!