
న్యూస్

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹3,650 పెరిగి ₹1,53,800కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹2,990 పెరిగి ₹1,41,000కు చేరింది. ఈ పెరుగుదలతో బంగారం ధరలు గణనీయంగా ఎగబాకాయి.
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా ₹10,000 పెరిగి ₹2.65 లక్షలకు చేరింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటి కారణాల వల్ల ఈ ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగించగా, పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!