
సినిమాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు ఆల్ క్యాస్ట్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేలుడుతో మంటలు వేగంగా వ్యాపించి పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
ఈ ఘటనలో 12 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో 12 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంటల్లో నగదు, బంగారు ఆభరణాలు, పిల్లల స్కూల్ సర్టిఫికెట్లు కాలిపోయాయి. నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!