

తుఫాను ‘సెన్యార్’ బుధవారం ఉదయం ఇండోనేషియా తీరం దాటింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య భూ భాగాన్ని తాకిన ఈ తుపాను 70–80 కిమీ వేగంతో గాలులను, గుస్తులు 90 కిమీ వరకు నమోదైనట్లు అమరావతి IMD తెలిపింది. సెన్యార్ మాలక్కా జల సంధి మీదుగా గంటకు 13 కిలో మీటర్ల వేగం తో పశ్చిమ-దక్షిణ పశ్చిమ దిశగా కదులుతూ, 4.9°N అక్షాంశం వద్ద ఇండోనేషియా ఈశాన్య తీరాన్ని దాటింది.
తుఫాను ప్రభావం సమయం లో ఇది కుట్టా మక్మూర్ కు తూర్పున 80 కిలో మీటర్లు, మలేషియా లోని జార్జ్ టౌన్ కు పశ్చిమాన సుమారు 280 కిలో మీటర్ల దూరంలో ఉండింది.
ప్రస్తుతం ఈ వ్యవస్థ నికోబార్ దీవులు లోని నాంకోవరి నుంచి దక్షిణ-తూర్పున 580 కిమీ, కార్ నికోబార్ నుంచి దక్షిణ-తూర్పున 730 కిమీ దూరంలో ఉంది. నవంబర్ 27 ఉదయం వరకు సెన్యార్ తుఫాను తీవ్రత కొనసాగి, తర్వాత తూర్పు దిశగా వాలుతూ తదుపరి 24 గంటల్లో బలహీన పడుతుందని IMD వెల్లడించింది.
ఇక బంగాళాఖాతంలో మరో వాతావరణ ప్రభావం ఏర్పడుతోంది. దక్షిణ పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ-తూర్పు శ్రీలంక, సమీప భూ మధ్యరేఖ భారత మహాసముద్రం పై ఉన్న బలమైన అల్పపీడనం వచ్చే 24 గంటలలో డిప్రెషన్ గా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి దిశగా ఉత్తర-ఉత్తర పశ్చిమ దిశలో కదులుతూ మరింత బలపడుతుందని అంచనా.
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో విస్తార ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశమూ ఉంది.
బుధవారం ఆంధ్రప్రదేశ్ లో నమోదైన ఉష్ణోగ్రతలు: కలింగపట్నం (27.9°C), విశాఖపట్నం (29.2°C), తుని (31.5°C), కాకినాడ (30.6°C), అమరావతి (31.5°C).



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!