
న్యూస్

టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఏఐ వీడియో కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. సరదాగా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అతడిని అనవసరమైన వివాదంలోకి నెట్టింది.
రింకూ సింగ్ పోస్ట్ చేసిన వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని కర్ణి సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. సనాతన ధర్మాన్ని కించపరచడని ఆరోపిస్తూ, హిందువులందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియోలో హనుమంతుడు థార్ కారును నడుపుతూ ఉండగా, శివుడు, విష్ణువు, వినాయకుడు వెనుక సీట్లో ప్రయాణిస్తున్నట్లు చూపించారు. దేవుళ్లు సన్ గ్లాసెస్ పెట్టుకుని మోడ్రన్‌గా కనిపించగా, బ్యాగ్రౌండ్లో ఇంగ్లిష్ పాట వినిపించింది. ఈ వీడియోకు “నిన్ను క్రికెటర్‌గా ఎవరు చేశారో తెలుసా?” అనే క్యాప్షన్ పెట్టిన రింకూ, ఇప్పుడు పోలీసు ఫిర్యాదులు, నిరసన హెచ్చరికలు ఎదుర్కొంటున్నాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!