

వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అందజేసినట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వెనెజువెలా ప్రజల స్వేచ్ఛ కోసం ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మచాడో తెలిపారు. గతంలో తాను అనేక యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తనకంటే అర్హులు లేరని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మచాడో నుంచి అవార్డును స్వీకరించిన అనంతరం ట్రంప్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇది పరస్పర గౌరవానికి నిదర్శనమని తెలిపారు. ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేస్తూ మచాడోకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే దీనిపై నోబెల్ కమిటీ స్పష్టత ఇచ్చింది. ఒకసారి నోబెల్ బహుమతి ప్రకటించిన తర్వాత దానిని రద్దు చేయడం, బదిలీ చేయడం లేదా ఇతరులకు అప్పగించడం సాధ్యం కాదని కమిటీ స్పష్టం చేసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!