
.webp&w=3840&q=75)
అమెరికాలో హెచ్-1బీ వీసాదారులపై, ముఖ్యంగా భారతీయ ఉద్యోగులపై అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఒక్క హెచ్-1బీ ఉద్యోగి 10 మంది అక్రమ వలసదారులతో సమానమని వ్యాఖ్యానిస్తూ, సిలికాన్ వ్యాలీలో భారీగా విదేశీయులే పనిచేస్తున్నారని అన్నారు. కొన్ని టెక్ కంపెనీల్లో 85–95 శాతం వరకు భారతీయులే ఉన్నారని, తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ ఇంజినీర్లపై కంపెనీలు ఆధారపడుతున్నాయని ఆరోపించారు.
రాస్ముస్సేన్ రిపోర్ట్స్ సీఈఓ అయిన మిచెల్, స్టీవ్ బానన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసాలను ఉపయోగించి అమెరికన్ల స్థానంలో విదేశీయులను నియమించుకోవడం దోపిడీగా మారిందని విమర్శించారు. 2025 ఇండస్ట్రీ ఇండెక్స్ ప్రకారం సిలికాన్ వ్యాలీ టెక్ ఉద్యోగాల్లో 66 శాతం విదేశీయులే ఉండగా, అందులో 23 శాతం భారతీయులు ఉన్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీల్లో భారతీయుల సంఖ్య తగ్గించేందుకు కన్సల్టెన్సీ ప్రారంభిస్తానని మిచెల్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు జాత్యహంకారాన్ని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!