

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు రోజుల కంటే ఈరోజు చలి ఇంకా ఎక్కువగా నమోదైంది. తెల్లవారుజామున బయట అడుగు పెడితేనే చలి గట్టిగా తగులుతూ ప్రజలను ఇబ్బందిపెడుతోంది. చలి తో పాటు పొగమంచు కూడా పెరగడంతో రోడ్లపై విజిబిలిటీ దాదాపు తగ్గిపోయింది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలంగాణలో పలుచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్చెరు, ఆదిలాబాద్లో 7°C, మెదక్, హనుమకొండ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 9°C రికార్డు అయ్యాయి. హైదరాబాద్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, నల్గొండ వంటి ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, వరంగల్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గట్టిగా పడిపోతున్నాయి. డుంబ్రిగూడ, మినుములూరు 4°C, అరకు 5°C, పాడేరు 6°C, చింతపల్లి 6.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నీళ్లు గడ్డకట్టేంత చలి ఉండటంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. అల్లూరి, పార్వతీపురం, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కూడా 12°C లోపే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో అరకు, వంజంగి, మాడగడ వంటి పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!