

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీజన్లో తొలిసారిగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4.8 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
నాలుగు జిల్లాలను మినహాయిస్తే, రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా ఉందని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున పొగమంచు విస్తరిస్తుండటంతో రహదారి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలం ప్రభావంతో ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండు మూడు రోజుల్లోనూ ఇదే స్థాయిలో చలి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!